Friday, October 24, 2025

 Today, an Eye Camp was successfully conducted in our college campus. The program was initiated by the Unnat Bharat Abhiyan (UBA) in collaboration with Dr. Agarwal’s Eye Hospital. The camp aimed to promote eye health awareness and provide free eye check-ups for students and staff.


A large number of students and faculty members actively participated and benefited from the camp. The initiative received positive feedback for its social outreach and health benefits.













Wednesday, October 1, 2025

Our Instagram page

 I'm on Instagram as @andhrakesaridegreecollege. Install the app to follow my photos and videos.

 https://www.instagram.com/andhrakesaridegreecollege?igsh=YzljYTk1ODg3Zg==

Wednesday, September 10, 2025

ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో మహాకవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆయన సాహిత్య వారసత్వాన్ని, రచనా వైశిష్ట్యాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలుగు అధ్యాపకురాలు శ్రీమతి వి. నాగమణి గారు అధ్యక్షత వహించారు. ఆమె విశ్వనాథ గారి బాల్యం, రచనా ప్రస్థానం, కవితా శైలి మరియు తాత్విక దృక్పథం వంటి అంశాలపై విశ్లేషణాత్మకంగా మాట్లాడారు. ఈ వేడుకకు ఆంధ్ర కేసరి యువజన సమితి సభ్యులు శ్రీ మదిరాజు శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై, విశ్వనాథ గారి రచనల ప్రభావాన్ని, ముఖ్యంగా వేయిపడగలు మరియు రామాయణ కల్పవృక్షం వంటి మహత్తర గ్రంథాల ప్రాముఖ్యతను వివరించారు. కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ప్రొఫెసర్ గొర్ల రమణయ్య గారు విశ్వనాథ గారి రచనలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించడంలో కీలక పాత్ర పోషించాయని అన్నారు. ఆయన రచనలు కాలాతీతమైన మానవ విలువలను ప్రసారించాయని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ వి. ఉదయకిరణ్ గారు కవి సమ్రాట్ జీవన యాత్ర, ఆయన విద్యా నేపథ్యం, వృత్తి విశేషాలను విద్యార్థులకు పరిచయం చేశారు. అలాగే వైస్ ప్రిన్సిపాల్ అప్పారావు గారు విశ్వనాథ గారి తెలుగు భాషాభివృద్ధిలో చేసిన కృషిపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు.



 

Thursday, September 4, 2025

ప్రెస్ నోట్ ది. 05-09-2025, రాజమహేంద్రవరం ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కళాశాల అవర్ణం లో గల భారత దేశపు మాజీ రాష్ట్రపతి, మహానుభావుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ బి. అప్పారావు గారు, వి. సర్వేశ్వరరావు గారు, పి. రాంబాబు గారు తదితరులు పాల్గొని టీచర్స్ డే ప్రాముఖ్యతను వివరించారు. గురువుల సేవలు సమాజ అభ్యున్నతికి మార్గదర్శకమని వారు పేర్కొన్నారు.


 

టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహణ రాజమహేంద్రవరం,సెప్టెంబర్ 4: స్థానిక ఆంధ్ర కేసరి డిగ్రీ కళాశాలలో టీచర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి కళాశాల సెక్రటరీ & కరస్పాండెంట్ శ్రీ గొర్ల రమణయ్య గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణనన్ గారి జీవిత విశేషాలు బాల్యం, విద్యాభ్యాసం, ఉద్యోగ, రాజకీయ జీవితం గురించి వివరించారు . విద్యార్థులు తమ గురువుల గొప్పతనాన్ని వివరిస్తూ ఉపన్యాసాలు ఇవ్వగా, అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వి. ఉదయ కిరణ్ గారు మాట్లాడుతూ, భారతదేశ రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని పురస్కరించుకొని, ముఖ్య అతిథి శ్రీ గొర్ల రమణయ్య గారికి చిరు సత్కారం అందించారు. ఈ సందర్భంగా ఆయన, రమణయ్య గారి బాల్యం, విద్యాభ్యాసం మరియు సామాజిక సేవల గురించి వివరించారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీ బి.వి. అప్పారావు గారు మాట్లాడుతూ, సనాతన సంప్రదాయంలో గురువులను పూజించుకునే విశిష్టత గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ వి. సర్వేశ్వర రావు, ఎన్. త్రివేణి, టి. శ్యామల, టి.వి.వి. పద్మావతి, పి. రాంబాబు, ఎల్. మదన్ మోహన్, వి. లావణ్య, ఎం. పరిమళ, బి. సాయి లలిత, డి. రాఘవేంద్ర చందు తదితర అధ్యాపకులు, విద్యార్థినీ–విద్యార్థులు పాల్గొన్నారు.


 

Saturday, August 23, 2025

📰 ప్రెస్ నోట్ ఆంధ్రకేసరి డిగ్రీ కళాశాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు వి.భాస్కర్ రామ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి టంగుటూరి ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల కరస్పాండెంట్ శ్రీ గోర్ల రమణయ్య గారు మాట్లాడుతూ ఆంధ్రకేసరి బాల్యం, విద్యాభ్యాసం, న్యాయవాద వృత్తి, రాజకీయ జీవితం గురించి విశదీకరించారు. కార్యక్రమంలో యువజన సమితి జనరల్ సెక్రటరీ సి.పి. రెడ్డి గారు, కళాశాల ప్రిన్సిపాల్ వి. ఉదయ కిరణ్ గారు, వైస్ ప్రిన్సిపాల్ బి.వి. అప్పారావు గారు పాల్గొన్నారు. అలాగే అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.